జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఆయనకు స్థిరత్వం లేదన్నారు. పూటకో మాట రోజుకో నాటకంలా.. ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఆనాడు ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి..?’ పుస్తకాన్ని ఆవిష్కరించింది పవన్ కల్యాణ్ కాదా..? గూగుల్‌లో వెదికితే అసలు నిజం తెలుస్తోందన్నారు. ఈరోజు అదే అమరావతి పవన్ కల్యాణ్‌కు ముచ్చటైన వేదికగా కనిపిస్తుందా..? అని నిలదీశారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు.. ఆయన చేసిన పాపాలే ఇప్పుడు పవన్ కల్యాణ్‌నూ చుట్టుముడుతున్నాయని చెప్పుకొచ్చారు. నేడు చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా.. సొంతకొడుక్కి లేని నొప్పి పవన్ కల్యాణ్‌కి కలుగుతుంది కనుకే ఆయన్ను దత్తపుత్రుడు అని తాము అంటున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ అమ్మేశాడని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి అని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.
పూటకో మాట రోజుకో నాటకం- పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్
85
previous post