పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, దాచేపల్లిలో
ఉరకలెత్తుతున్న ఈ జనసంద్రాన్ని చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకు పుడుతుందని అన్నారు. యువత, మహిళలు ఏ వైపు ఉంటే ఆ వైపుదే గెలుపు… టీడీపీ – జనసేన గెలుపును ఎవరూ అడ్డుకోలేరు… ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతాం అని స్పష్టం చేశారు. తాను ఇవాళ హైదరాబాద్ నుంచి బయల్దేరితే అన్నీ శుభపరిణామాలే జరిగాయన్నారు. మొదట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. అక్కడ్నించి నెల్లూరు వెళితే సాక్షాత్తు ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చారని తెలిపారు. ఉత్సాహవంతుడు, చదువుకున్నవాడు… స్వలాభం కోసం కాదు… నిజమైన ప్రజాసేవ కోసం టీడీపీలోకి రావడం సంతోషించదగ్గ విషయన్నారు.
ఈ జనసంద్రాన్ని చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకే…
94
previous post