పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతినెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. గత పాలకులు పదేండ్లపాటు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించి తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సర్పంచ్ ఎన్నికలపై సీతక్క కీలక వ్యాఖ్యలు
78
previous post