89
ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆస్తులన్నీ అడ్డదిడ్డంగా అమ్మేసేవారని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ విమర్శించారు. ప్రజలందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కురవి మండలం బలపాలలో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. హామీలను అమలు చేయడంలో కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అధికారం పోతుందనే అసహనం, ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులున్నారని ఆరోపించారు. మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని, అందువల్ల మనమే శాంతంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు వస్తాయని రాంచంద్రునాయక్ అన్నారు.