హైదరాబాద్ : రామకృష్ణ మఠం(Ramakrishna Matam)లో ఈ నెల 27 నుంచి యువతకు ‘శౌర్య’ పేరిట క్యాంప్ (Shaurya Residential Camp) జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. యువకులకు రెసిడెన్షియల్ క్యాంప్ ఉంటుందని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. శౌర్య క్యాంపులో యువతకు స్వామి వివేకానంద సందేశంపై ప్రత్యేక తరగతులుంటాయి.ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బృంద చర్చలతో పాటు ప్రశ్న-జవాబుల సెషన్ కూడా ఉంటుందని బోధమయానంద తెలిపారు. యోగ, ధ్యానం, భక్తి సంగీతంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. క్యాంపునకు హాజరయ్యే యువత తెల్లటి దుస్తులు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 91772 32696 నంబరు ద్వారా సంప్రదించగలరని నిర్వాహకులు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.