హైదరాబాద్ : రామకృష్ణ మఠం(Ramakrishna Matam)లో ఈ నెల 27 నుంచి యువతకు ‘శౌర్య’ పేరిట క్యాంప్ (Shaurya Residential Camp) జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. యువకులకు రెసిడెన్షియల్ క్యాంప్ ఉంటుందని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. శౌర్య క్యాంపులో యువతకు స్వామి వివేకానంద సందేశంపై ప్రత్యేక తరగతులుంటాయి.ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బృంద చర్చలతో పాటు ప్రశ్న-జవాబుల సెషన్ కూడా ఉంటుందని బోధమయానంద తెలిపారు. యోగ, ధ్యానం, భక్తి సంగీతంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. క్యాంపునకు హాజరయ్యే యువత తెల్లటి దుస్తులు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 91772 32696 నంబరు ద్వారా సంప్రదించగలరని నిర్వాహకులు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా తన అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పేరుగాంచిన S-500ను పూర్తి సాంకేతిక బదిలీతో భారత్‌లోనే తయారు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ…
- పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన…
- గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 81000