Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana రామకృష్ణమఠంలో యువతకు శౌర్య రెసిడెన్షియల్‌ క్యాంప్

రామకృష్ణమఠంలో యువతకు శౌర్య రెసిడెన్షియల్‌ క్యాంప్

by Rama
Rama Krishna Matam

హైదరాబాద్‌ : రామకృష్ణ మఠం(Ramakrishna Matam)లో ఈ నెల 27 నుంచి యువతకు ‘శౌర్య’ పేరిట క్యాంప్‌ (Shaurya Residential Camp) జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. యువకులకు రెసిడెన్షియల్‌ క్యాంప్‌ ఉంటుందని హైదరాబాద్‌ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. శౌర్య క్యాంపులో యువతకు స్వామి వివేకానంద సందేశంపై ప్రత్యేక తరగతులుంటాయి.ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బృంద చర్చలతో పాటు ప్రశ్న-జవాబుల సెషన్‌ కూడా ఉంటుందని బోధమయానంద తెలిపారు. యోగ, ధ్యానం, భక్తి సంగీతంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. క్యాంపునకు హాజరయ్యే యువత తెల్లటి దుస్తులు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 91772 32696 నంబరు ద్వారా సంప్రదించగలరని నిర్వాహకులు సూచించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: