నిలిచిపోయిన 20 భారీ చమురు నౌకలు జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించిందని…

Advertisements

<p>ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది&period; నిలిచిపోయిన 20 భారీ చమురు నౌకలు జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు&period; నౌకల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి&period; ఇరాన్ ఒక గొప్ప దేశం&period; వారు మమ్మల్ని గౌరవిస్తున్నారు&period; అందుకు ప్రతిఫలంగానే 20 భారీ చమురు నౌకలను హర్మూజ్ జలసంధి దాటేందుకు అంగీకరించారని ట్రంప్ తెలిపారు&period; ఈ నిర్ణయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు భారీ ఊరట లభించినట్లయింది&period; యుద్ధ భయాలతో ఆకాశాన్నంటిన ముడిచమురు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు&period; ఇటీవల ఇరాన్‌పై అమెరికా దాడులు&comma; ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం దిశగా అమెరికా ప్రయత్నాలు వంటి పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది&period; దౌత్యపరమైన చర్చలు లేదా వ్యూహాత్మక ఒత్తిడి కారణంగా ఇరాన్ తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది&period; పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడానికి ఇది ఒక సానుకూల సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.