పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఉన్న సంజీవని ఐసియూ అంబులెన్స్ కు జబ్బు చేసింది. అత్యవసర వైద్య చికిత్సల కోసం మెరుగైన వైద్యం కోసం సింగరేణి కార్మికులను ఉద్యోగులను ఇతర ప్రాంతాల కార్పొరేట్ అసుపత్రులకు తరలించే అన్ని వసతులు ఉన్న సింగరేణి ఐసియూ అంబులెన్స్ సంజీవని కి జబ్బు చేసింది. మూడు నెలల క్రితం అంబులెన్స్ కు సాంకేతిక లోపాలు రావడంతో మూలకు పడేశారు. సింగరేణి ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు లాంటి కార్పోరేట్ ఆసుపత్రులకు తరలించే సమయంలో ఇదే అంబులెన్స్ లో పేషెంట్ కు పూర్తిస్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించే సౌకర్యాలు ఉండేవి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడే సకల సౌకర్యాలు ఉన్న ఈ సంజీవనికి మూడు నెలలు గడిచిన మరమ్మత్తులు చేయించాల్సిన సింగరేణి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంజీవని మూలన పడడంతో ఎలాంటి సౌకర్యాలు లేని సాధారణ అద్దె అంబులెన్స్ లో పేషెంట్లను ఇతర కార్పోరేటు అసుపత్రిలకు తరలిస్తున్నారు. దీంతో మార్గం మద్యలో ప్రాణాలు పోయే అవకాశం ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సింగరేణి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వీడి ఐసియూ సేవలను అందించే సంజీవని అంబులెన్స్ కు రిపేరు చేయించి ప్రమాదాల బారిన పడిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులను మెరుగైన వైద్య సేవలకు ఇతర ప్రాంతాలకు సంజీవని అంబులెన్స్ ద్వారా తరలించి వారి ప్రాణాలను కాపాడాలని సింగరేణి కార్మికులు, కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఆపదలో సింగరేణి ఆసుపత్రి సంజీవని అంబులెన్స్
101
previous post