శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

Advertisements

<p>కంచే చేను మేస్తే దిక్కెవరు&period;&period;&quest; కాపాడాల్సిన వారే కబళిస్తుంటే ఇక అడ్డుకునేదెవరు&period;&period;&quest; శ్రీ కాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది&period; ఇక్కడి వంశధార నదీ తీరం అక్రమ తవ్వకాలతో కుదేలవుతోంది&period; నిబంధనలను తుంగలో తొక్కి&comma; పగలు రాత్రి తేడా లేకుండా వందలాది లారీలతో ఇసుకను ఒరిస్సా తరలిస్తున్నారు&period; సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారింది&period;<br &sol;>&NewLine;హిరమండలం మండలంలోని భగీరథపురం&comma; రుగడ గ్రామ సమీపంలో ఉన్న పొంటూరు ఇసుక రీచ్‌à°² నుంచి భారీ ఎత్తున అక్రమ రవాణా సాగుతోంది&period; నిత్యం వందలాది లోడ్ల ఇసుక ఇక్కడి నుంచి ఒరిస్సా తరలిపోతోంది&period;<br &sol;>&NewLine;తమకు ఎమ్మెల్యేనే అనుమతి ఇచ్చారని&period;&period; ప్రతి లోడుకు ఆయనకు ఆరు వందల రూపాయలు చెల్లిస్తున్నామంటూ కాంట్రాక్టర్ అనుచరులు బహిరంగంగానే చెబుతుండటం గమనార్హం&period;&period;<br &sol;>&NewLine;ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ యంత్రాంగం గానీ&comma; ఇటు మైనింగ్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు&period; అధికారులకు కూడా మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; ఇటీవల సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేను మందలించినట్లు ప్రచారం జరుగుతున్నా&comma; క్షేత్రస్థాయిలో మాత్రం ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు&period; ఇదంతా చూస్తుంటే ఈ మాఫియా ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది&period;<br &sol;>&NewLine;పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు&comma; హిరమండలం ప్రాంతాల్లో ఇసుక దోపిడీ పరాకాష్టకు చేరింది&period; మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే ఈ అక్రమాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది&period; ప్రభుత్వ సంపదను దోచుకుంటూ&comma; నదీ తీరాలను నాశనం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period; మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అరికడతారో లేదో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.