డ్రగ్స్ కు బానిసలు కావద్దు — ఎస్పి, సూర్యాపేట
గంజాయి లాంటి మత్తు పదార్థాలను, కల్తీ కల్లు నిర్మూలించడం పట్ల ప్రజలు, యువత అవగాహన కలిగి ఉండాలని ప్రజా అవగాహన పోస్టర్ ను ఈరోజు ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు అధనపు ఎస్పి, DSP లతో కలిసి గురువారం రోజున తన కార్యాలయం నందు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు అందించిన పోస్టర్స్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లకు అందించాం అన్నారు. గంజాయి వల్ల సమాజానికి హాని ఉన్నదని, యువశక్తి నిర్వీర్యం అవుతుందని, గంజాయి నిర్మూలనలో ప్రతిఒక్కరు బాగస్వామ్యం కావాలని అన్నారు. గంజాయి నిర్మూలన, వాటి మూలాలను తొలగించడం కోసం జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా పని చేస్తున్నది అని ఎస్పీ గారు ఈ సందర్భంగా తెలిపినారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ లు నాగేశ్వర రావు, జనార్ధన్ రెడ్డి, DCRB DSP మట్టయ్య, కోదాడ DSP శ్రీధర్ రెడ్డి, CI లు రాము, రఘువీర్ రెడ్డి ఉన్నారు.