91
విజయవాడ నగరంలో పోలీసులు మరోసారి వ్యభిచారం గుట్టురట్టు చేశారు. విజయవాడ సెంట్రల్ డివిజన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచారాన్ని గుట్టురట్టు చేశారు. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు నిర్వాహకులను మాచవరం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మహిళలను టార్గెట్ చేసుకొని ఇతర రాష్ట్రాల నుండి మహిళలను తీసుకువచ్చి స్పా సెంటర్ పేరుతో వ్యభిచారాలను నిర్వహిస్తున్నారని, స్పా మాయాజాలంలో ఇరుక్కొని ఎంతోమంది తమ అమూల్యమైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అమాయకుల జేబులు గుల్ల చేస్తున్న ఇటువంటి స్పా సెంటర్లపై ఉక్కు పాదం సెంట్రల్ ఏసిపి భాస్కరరావు మోపుతామన్నారు.