ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక తొలి రోజే డీఎస్సీపై సంతకం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ ఖాళీలతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ కుప్పంలో యువతతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయో వారికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా… మీరు బయటికి రండి. ఇవాళ ఐదు వేలు జీతం తీసుకుంటున్నారు. మీరు ఇంట్లోనే కూర్చుని రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం అని చంద్రబాబు వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువత జీవితాలు మెరుగుపరిచే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.
కుప్పంలో యువతతో ప్రత్యేక సమావేశం..
93
previous post