74
మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం రోడ్డు ప్రక్కన చుక్కల దుప్పి కళేబరం కనబడటంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు దాటుతున్న సమయంలో ఏదైనా వాహనం ఢీ కొట్టి తీవ్ర గాయాలపాలై చుక్కల దుప్పి సమీపంలోనే మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. నిడుముక్కల అటవీ ప్రాంతం నుండి చుక్కల దుప్పి వచ్చినట్లు డిఆర్ఓ గిరిబాబు తెలిపారు.