శ్రీముఖలింగం దేవాలయం

Srimukhalingam Temple

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున నగరికటకం&comma; ముఖలింగం అనే రెండు గ్రామాలున్నాయి&period; ఈ రెండు గ్రామాల నడుమ&comma; ముఖ్యంగా ముఖలింగంలో మధుకేశ్వరాలయం&comma; సోమేశ్వరాలయం&comma; భీమేశ్వరాలయం అని మూడు శైవ దేవాలయాలు ఉన్నాయి&period; ఈ మూడు ఆలయాలలో &&num;8220&semi;మధుకేశ్వరాలయం&&num;8221&semi; అతి పురాతనమైనది&comma; చారిత్రక ప్రసిద్ధమైనది&period; <br><strong>దేవాలయం కథ &colon;<&sol;strong><br>ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది&period; ఆ యోగాన్ని చూడటానికి గంధర్వ రాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు&period; ఆ హిమాలయాలమీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు&period; శబర కాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు&period; అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి &OpenCurlyQuote; సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబర జాతిలో జన్మించండి’ అని శపించాడు&period; గంధర్వులంతా శబరులుగా జన్మించారు&period; వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు&period; అతని రాణి చిత్తి&period; రెండవ భార్య చిత్రకళ&period; ఈమె శివభక్తురాలు&period; ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు&period; చీటికీ మాటికీ కీచులాడుకునేవారు&period; ఒకరోజు చిత్తి తన భర్తను చేరి &OpenCurlyQuote;నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కళైనా ఉండాలి&period; ఏదో ఒకటి తేల్చి చెప్పు’ అని అతనిని నిలదీసింది&period; శబర నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను పిలిచి &OpenCurlyQuote;మన వాకిలిలో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలు రెండు వంచి&comma; రాలిన పువ్వులు ఏరుకుని&comma; వాటిని అమ్ముకుని బతకమన్నాడు&period; మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక&comma; ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు ఏరుకునేది&period; అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి&period; చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది&period; ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది&period; విసుగు చెందిన శబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్నచెట్టే కారణమని తలచి&comma; ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు&period; అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు&period; అది చూసి శబర నాయకుడు మూర్ఛబోయాడు&period; దీనికంతటికీ చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు&period; అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు&period; ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు&period; మధుకేశ్వరాలయానికి ముందు పెద్ద నంది విగ్రహం ఉంది&period; గర్భాలయంలో తెల్లని ముఖలింగేశ్వరుడు దర్శనమిస్తాడు&period; ఈ ఆలయంలో ఉన్న అనేక శాసనాలలో అతి ప్రాచీనమైన శాసనం&comma; శిల్ప లక్షణాధారం ప్రకారం ఈ ఆలయం 8à°µ శతాబ్ధిలో నిర్మాణం జరిగి ఉండవచ్చునని పరిశోధకుల అభిప్రాయం&period; ఇతర భక్తుల సంగతి ఎలా ఉన్నా మధుకేశ్వరుడు శబరుల&comma; గిరిజనుల ఆరాధ్యదైవంగా ఇప్పటికీ పూజింపబడుతూండడం శబరుల అవ్యాజభక్తికి నిదర్శనం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..