రాజకీయ టర్న్ తీసుకున్న శ్రీశైల మహాకుంభాభిషేక వివాదం

Sangala Sagar

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Srisailam &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీశైలంలో మహాకుంభాభిషేకం వివాదం రాజకీయ టర్న్ తీసుకుంది&period; పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా రాజకీయ నాయకుల ఒత్తిడితో ముందే జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు&comma; ఇటువంటి పరిణామాలు దేవాలయానికి అరిష్టం అనే వాదన బలంగా వినిపిస్తోంది&period; ఆలయ శాస్త్రం ప్రకారం కార్యక్రమాలు జరగాలని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి&period; శ్రీశైలంలో ప్రతీ 12 ఏళ్లకు ఓసారి మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు&period; గతేడాది ఆలయ ఈవో ఆధ్వర్యంలో సుమారు రూ&period;3 కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేశారు&period; శివాజీ గోపురంతో పాటు ప్రధానాలయాలు&comma; ఉపాలయాలకు పరంజాలు సిద్ధం చేశారు&period; రంగులతో అలంకారాలు&comma; విద్యుద్దీపాల ఏర్పాట్లు చేపట్టారు&period; ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ముహూర్తాలు ఖరారు చేశారు&period; ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు&period; ఇక ప్రారంభమే తరువాయి అన్న క్షణంలో ముహూర్తం నిర్ణయించే విషయంలో పీఠాధిపతులకు ప్రాధాన్యం ఇవ్వలేదని వివాదం మొదలైంది&period; ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది&period; ఉత్తరాయణంలో చేయాల్సిన కార్యాన్ని దక్షిణాయనంలో చేస్తామని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ప్రకటించి అగ్నికి ఆజ్యం పోశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కోర్టుకు చేరిన మహా కుంభాభిషేకం పంచాయితీ శ్రీశైలంలో మహాకుంభాభిషేకం&comma; ఇతర కార్యక్రమాల నిర్వహణను వాయిదా వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్‌ చైర్మన్‌ సంగాల సాగర్‌ ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు&period; ఈ వ్యాజ్యంపై గతేడాది మే నెలలో విచారణ జరిపిన ధర్మాసనం ముహూర్తం తిరిగి ఖరారు చేయాలని దేవాదాయశాఖను&comma; శ్రీశైలం దేవస్థానం ఈవోను ఆదేశించింది&period; అందుకోసం సంప్రదింపుల ప్రక్రియను గరిష్ఠంగా ఆరు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది&period; అయితే తాజాగా దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ముహూర్తం నిర్ణయించేందుకు దేవస్థానం ఏడు నెలల సమయం తీసుకోవడంపై దేవదాయ శాఖకు చివాట్లు పెట్టింది&period; దీంతో ఈ నెల 16 నుంచి శ్రీశైలం దేవస్థానంలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించి 21à°¨ మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని దేవాదాయశాఖ న్యాయవాది మరియు దేవాదాయ కమిషనర్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు&period; కుంభాభిషేకం నిర్వహణకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను కోర్టుకి అందజేశారు&period; ఈ వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం అపిల్ పై విచారణ మూసివేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంత్రి నిర్ణయించిన ముహూర్తానికి జరపడం ఏంటి కారణాగమం ప్రకారం మాఘ మాసం ప్రతిష్ఠలకు పనికిరాదు&period; అనాదిగా శ్రీశైల దేవస్థానంలో సనాతన ధర్మం సాంప్రదాయ పద్దతులను అనుసరిస్తూ శైవాగమం ప్రకారం కుంబాభిషేకం విషయమై శృంగేరి పీఠాధిపతులను మరియు పుష్పగిరి పీఠాధిపతుల నుంచి అలాగే కంచి పీఠాధపతులను సంప్రదించి వారు నిర్ణయించిన ముహూర్తానికే కార్యక్రమం జరుపుతారు&period; అయితే ఈసారి అందుకు భిన్నంగా పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా కార్యక్రమాలను జరుపుతున్నారు&period; ఈనెల 16 నుంచి నిర్వహించాలని దేవాదాయ శాఖ దేవస్థానం వారిని ఆదేశించారు&period; ఈ ముహూర్తంలో జరపడం ప్రామాణికం కాదని శాస్త్ర సమ్మతం కాదని ఆగమ శాస్త్ర విరుద్ధమని పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తాన్ని కాదని చేయుట శ్రేయస్కరం కాదని హిందూ సంఘాల వారు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు&period; లోకక్షేమం కాదు&period; కేవలం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నిర్ణయించిన ముహూర్తానికి కార్యక్రమం జరపడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు&period; అంతేకాదు పండితులు&comma; పీఠాధిపతులు&comma; స్థానిక సిబ్బంది ఇంత మందికి ఇష్టం లేకుండా పీఠాధిపతుల యొక్క సమక్షంలో జరుగకుండా కార్యక్రమం చేయటం అనేది లోక కళ్యాణం కాకపోగా దేశారిష్టమని అంటున్నారు&period; కావున ప్రస్తుతం కుంభాభిషేకం నిలిపివేసి పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"http&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"NIWf5DEvFcU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్