66
పీజీ విద్యార్థులు కోటి ఉమెన్స్ కాలేజ్ ముందు విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ అటానమస్ సెమిస్టర్ కి 5000 చొప్పున ఫీజు నిర్ణయించడం జరిగిందని హాస్టల్ లో కూడా సరైన వసతులు లేవని వాటర్, వసతి లేదని ఆందోళన చేపట్టారు. ఇంతకుముందు ఈ యొక్క ఫీజు 3,500 మాత్రమే ఉండేదని ఫీజు తగ్గించాలంటూ కోటి ఉమెన్స్ కాలేజ్ గేటు వద్ద మహిళా విద్యార్థినిలు కూర్చొని ఆందోళన చేపట్టారు. పెంచిన ఫీజును తగ్గించాలని ధర్నాకు దిగారు. అందులో ముఖ్యమైనవి సరైన టాయిలెట్స్ లేకపోవడం త్రాగునీరు వెసులుబాటు లేకపోవడం మొదలగునవి ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.