విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి భవానిపురం లోని పార్టీ కార్యాలయానికి వచ్చారు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సందర్భం గా సుజనా చౌదరి(Sujana Chowdary) మాట్లాడుతూ…
విజయ వాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి(bjp) తరఫున పోటీ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషం. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది ఎంతో సంతోషంగా ఉంది. చంద్ర బాబు 2 సార్లు నన్ను రాజ్యసభ సభ్యులుగా చేశారు. కేంద్ర రాజకీయాలు అవగాహన పెంచుకున్న. పశ్చిమ ఇవ్వడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది.. నియోజక వర్గంలో అనేక అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం లభించింది. ప్రజలకు మేలైన సేవలు ఇవ్వడానికి కృషి చేస్తా…ఆ , నమ్మకం నాకు ఉంది. జనేసేన, టిడిపి నాయకులు, కార్య కర్తలు నా గెలుపు కు సహకరించాలి. ఏప్రిల్ 5 నుంచి ప్రచారం కనక దుర్గ అమ్మవారి ఆలయం వద్ద నుంచి మొదలు పెడతా. అసంతృప్తి వాదులను కలుపుకుని , బుజ్జగించి ముందుకు వెళతాం.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి