భారత సంతతి వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్(Sunita Williams) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 కు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఆమె ప్రయాణించనున్నారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుండడంపై సునీత విలియమ్స్ స్పందించారు.ఈసారి కాస్త ఆందోళనగా ఉందని, అయితే ప్రయాణంపై అంత భయం లేదని అన్నారు. లాంచ్ ప్యాడ్ వద్ద శిక్షణ సమయంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించడం సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. కాగా వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ఈ ప్రయాణం చేయనున్నారు.ఈ అంతరిక్షయానంతో హ్యుమన్-రేటెడ్ అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించనున్న తొలి మహిళగా సునీత విలియమ్స్ నిలవనున్నారు. కాగా గతంలో ఆమె 2006, 2012లలో రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- డొనాల్డ్ ట్రంప్ కు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బఅమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా తేల్చగా.. ఈ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను…
- డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తాం – ట్రంప్అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.