కృష్ణా జిల్లా గుడివాడ, గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారు. చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నా. ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా. చంద్రబాబు కదలి రా అని తిరుగుతుంటే. కోర్టులు జైలుకు కదలి వెళ్ళు అంటున్నాయి. బాడీలో పార్టులు పని చేయడం లేదని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. బాలకృష్ణ , చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చిన ఫ్లెక్సీలు తొలగించడం తప్ప. జూ. ఎన్టీఆర్ ను ఎం చెయ్యలేరు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మూడు సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు ఉండవన్నారు ఎం జరిగింది ? తిరిగి ఇప్పుడు అదే జరుగతోంది. చంద్రబాబును గుడివాడలో పట్టించుకునే వారు ఎవరున్నారు. చంద్రబాబు రా కదలి రా సభలో 5వేల కుర్చిలు వేస్తే. లక్ష మంది ఎలా వస్తారు. సీఎం జగన్, పార్టీలో పికేసిన వాళ్ళే బయటకు వెళ్తున్నారు. పది రోజులైతే టిడిపి, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు. ఒక్క శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తే తమకు వచ్చే నష్టం లేదు. జగన్ అధికారంలో ఉండటానికి ప్రయత్నిస్తాను. పదవులు తనకు ఈక ముక్కతో సమానం అని ఆయన అన్నారు.
andhra pradesh
పల్నాడు జిల్లా, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు ఈ సందర్భంగా మాజీ మంత్రి ,టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీఆర్. ప్రపంచ దేశాల్లోనే తెలుగుజాతికి గౌరవం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. నటనలో కానీ, రాజకీయాల్లో కానీ తనకు సాటి లేదనిపించుకొన్న వ్యక్తి ఎన్టీఆర్. పేద బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి, వెనుకబడిన వర్గాల వారికి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందమూరి తారకరామారావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు. ఈ స్ర్కీనింగ్ కమిటీల్లో ఎక్స్-అఫిషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. క్లస్టర్ 1లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి హరీష్ చౌదరి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా విశ్వజీత్ కదమ్, జిగ్నేష్ మేవానీ సభ్యులుగా ఉన్నారు. క్లస్టర్ 2లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ – నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ చైర్మన్‌గా సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్ సభ్యులుగా ఉన్నారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, డామన్ – డయ్యూ, దాద్రా -నగర్ హవేలీ మూడవ క్లస్టర్లో ఉన్నాయి. రజనీ పాటిల్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా కృష్ణ అల్లవూరు, పర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. క్లస్టర్ 4లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఉన్నాయి. క్లస్టర్ 5లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఉన్నాయి. మరోవైపు అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు అల్కా లాంబాను ఆ పార్టీ నియమించింది.
Read Also..
Read Also..
కాకినాడ జిల్లా, రూరల్, ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ కే.స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుండి పెన్షన్ డబ్బులు నేరుగా ఇంటికే అందేలా ఆలోచించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్లు ఇచ్చేవారు. పెద ప్రజల కష్టాలు చూసిన జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి లబ్ధిదారులకు అందజేసి దేశం లో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశం లో ఏ రాష్ట్రం లో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, కులం, మతం, ఏ రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చారు అని చూడకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్న దమ్మున నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ పట్టంసెట్టి నారాయణ మూర్తి, ఎం.పి.పి గోపిసెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, తిమ్మపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. పాత గుంటూరు లోని బాలాజీ నగర్, 3,8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం. జనసేన కార్యకర్తలు ఆగ్రహం. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన నేతల ఆరోపణలు. దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఎంపీ కేశినేని నాని కి రాబోయే ఎన్నికల్లో సీటు లేదంటూ స్పష్టం చేసిన టీడీపీ అధిష్ఠానం. నిన్న సాయంత్రం నాని నీ కలిసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురాం, కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు. 7వ తేదీ చంద్రబాబు తిరువూరు సభకు కేశినేని నాని నీ దూరం పెట్టిన పార్టీ. తిరువూరు లో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జీ గా నియమించనున్న చంద్రబాబు.
అమరావతి, ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి రానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ అధికారులు ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలు, అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితా, ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను అధికారులు పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈసీ నుండి ఆదేశాలు.
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.