ప్రజల హృదయాల్లో నుంచి జన్మించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కొనియాడారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రంగా చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ. ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి రంగా మాత్రమేనని ప్రసాద్ అన్నారు. పేద ప్రజల కోసం, ముఠా కార్మిక సంఘాల కోసం రంగా ఎనలేని కృషి చేశారని తెలిపారు. తెలుగు వారు ఉన్నంతకాలం రంగా చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు. కొంతమంది నాయకులు ఆస్తులు సంపాదించుకుంటారు కానీ, రంగా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజల అభిమానాన్ని సంపాదించారని బోడె ప్రసాద్ కితాబునిచ్చారు.
andhra pradesh
సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలు దొంగలించి లారీలో వేసుకొని వెళ్తుండగా సినీ పక్కిలో వారిని వెంబడించి దాడులు నిర్వహించి దాదాపు లారీ తో సహా నాలుగు టన్నుల పైబడి ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు, సత్యవేడు సిఐ సర్కిల్ కి చెందిన స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం గోడౌన్లో కాపలా దారులను బెదిరించి వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడ్డ ఎర్రచందనం దొంగలు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు ఈ గోడౌన్ పై దాడులు చేస్తారని ఖచ్చితమైన సమాచారంతో వారం రోజులుగా టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పచెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుపతి జిల్లా రేణిగుంట, రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం బెంగళూరు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం వారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కి తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిధి గృహం వద్ద స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్.
మీచాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మీచాంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలూ పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాని జారీ చేశారు. మరో వైపు రేణిగుంట విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు చశారు. తిరుపతి నుంచి వెళ్లే పలు రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది. వర్ష తీవ్రత పెరుగుతుండడంతో గోగర్భం డాం గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also..
Read Also..
మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసింది. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ కనిపిస్తోంది. దీంతో కోయంబత్తూరు-చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు ఇండిగో సంస్థ రద్దు చేసింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పట వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించారు.
నెల్లూరుకు 250 కి.మీ, దూరంలో కేంద్రీకృతమై ఉన్న మీచౌంగ్ తుఫాన్…గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను. రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్. తీవ్రవాయుగుండం కారణంగా శనివారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా నమోదు కురుస్తున్న భారీ వర్షాలు. తీరం దాటే సమయంలో గంటకు 80 -100 కీమీ వేగంతో గాలులు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక…. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న నెల్లూరు జిల్లా యంత్రాంగం. ఇప్పటికే నెల్లూరు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు. మీచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో కోవూరు నియోజవర్గంలో పలు మండలాల్లో ఈదురుగాలితో కూడిన బారి వర్షం. కురుస్తున్న వర్షం దాటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు పలు మండలాల్లో కరెంట్ అంతరాయం.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్, మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం. దీని ప్రభావంతో ఈరోజు నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మంగళవారం అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం. సాయంత్రం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కుల గణన ప్రక్రియ వాయిదా పడింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3లోగా సర్వే పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఇవి విజయవంతం కావడంతో ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.అయితే ఈ ప్రక్రియను డిసెంబర్ 10కి వాయిదా వేస్తున్నట్టు బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రకటించారు.
దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది. ఇటీవల కర్నాటి చైర్మన్ నాన్న చనిపోయారు ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు, సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కృష్ణకి డబ్బులు తక్కువ ఇచ్చినందుకు దాడి చేశాడు. మద్యం మత్తులో గుంజా కృష్ణ దాడి చేశారు అని పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు. స్మశానంలోనే ఈ దాడి చేసిన వ్యక్తి నివాసం ఉంటున్నాడు.