ఇటలీ పార్లమెంటు(Italy Parliament)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్లు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మరిచి తన్నుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతి పక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ క్రమంలో సెంటర్ – లెఫ్ట్ ఫైవ్ స్టార్ మూమ్మెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడు పార్లమెంటులో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ముష్టిఘాతాలు, తోపులాట జరిగింది. ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర – దక్షిణ విభజనలు మరింత తీవ్రమవుతుందని, పేదరికంలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందుల్లో పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలోనే నేతలు ఇలా విచక్షణ, హుందాతనం మరిచి పరస్పరం దాడులకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై ఇటలీ విదేశాంగ మంత్రి విచారం వ్యక్తం చేశారు.
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీతృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్‌డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 33611