వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు(YSRCP President), ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర(Bus Yatra) ఇవాళ్టి షెడ్యూల్(Schedule) ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ విశాఖలోని ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇది చదవండి: ఎంతమందితో పొత్తులు పెట్టుకున్న గెలిచేది జగనే..!
అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం మూడున్నర గంటలకు గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారని రఘురాం తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి