వైఎస్సార్సీపీ అధ్యక్షుడు(YSRCP President), ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర(Bus Yatra) ఇవాళ్టి షెడ్యూల్(Schedule) ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ విశాఖలోని ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇది చదవండి: ఎంతమందితో పొత్తులు పెట్టుకున్న గెలిచేది జగనే..!
అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం మూడున్నర గంటలకు గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారని రఘురాం తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్‌ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
- అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమివంకపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్‌తో కలిసి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 150199