కాకినాడ జిల్లా.. తెలుగుదేశం పార్టీ అవిర్భవ దినోత్సవాన్ని(TDP Foundation Day) కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో మాజి శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి, రూరల్ టిడిపి కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో వారి నివాసం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పుల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి పెద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ, వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటూ చట్ట సభాల్లో వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ కి చెందుతుందన్నారు. రాష్ర్టంలో వైసిపి అరాచక పాలన నుండి రాష్టన్ని కాపాడే దిశగా నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో జన సేన బిజెపి పార్టీ లతో పొత్తు పెట్టుకుని వెళ్తిన ఈ ఎన్నికల్లో బ్యాలెట్ లో సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలకు వెళ్తునామన్నరు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి పొత్తు పెట్టుకున్న కారణం వాటి ప్రయోజనం కోసం బలంగా తీసుకువెళ్ళి జన సేన అభ్యర్ధులను గెలిపించాలని సూచించారు. అనంతరం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అనుభవం ఉన్న నాయకులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి అని ప్రతి నాయకుడిని కార్యకర్తను పెరు పెట్టీ పిలిచే వ్యక్తి అని అన్నారు.
ఇది చదవండి: ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి