93
తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి సభ అట్టర్ ప్లాఫ్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం కంటే.. జగన్‌ను విమర్శించడానికే ఏర్పాటు చేసినట్లుందని ఆరోపించారు. సిద్ధం సభలు విజయవంతం కావడంతో తాము కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే కౌంటర్ సభ ఏర్పాటు చేసి విఫలమయ్యారని ధ్వజమెత్తారు. సిద్ధం సభకు వచ్చిన జనాభాలో కనీసం 10 శాతం కూడా టీడీపీ, జనసేన సభకు రాలేదన్నారు. టీడీపీ -జనసేన కూటమితో క్యాష్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు కానీ.. ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రం కాదన్నారు మంత్రి అమర్నాథ్. కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు.. పవన్‌కల్యాణ్‌ను వాడుకుంటున్నారని గుడివాడ ఆరోపించారు.