ఎన్నికల (Elections) బరిలో నిలిచే ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తారు. గత ఎన్నికలతో పోలిస్తే పోటీలో ఉన్న ఇండిపెండెంట్ల సంఖ్య పెరిగింది. ఓట్లు రాకున్నా బరిలో నిలిచేందుకు ఇండిపెండెంట్లు ఆసక్తి చూపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఎంపీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ దఫా మొత్తం 66 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. హైద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 30 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో 09 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.హైద్రాబాద్ ఎంపీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ స్థానంలో ఎంఐఎంను ఓడించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. పాతబస్తీపై బీజేపీ కేంద్రీకరించింది.
సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి 45 మంది బరిలో నిలిచారు. ఇందులో 21 మంది ఇండిపెండెంట్లు. గత ఎన్నికల్లో 15 మంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి 43 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 21 మంది ఇండిపెండెంట్లు. 2019లో ఇదే స్థానం నుండి ఐదుగురు మాత్రమే పోటీ చేశారు. చేవేళ్ల స్థానం నుండి 22 మంది బరిలో నిలిచారు. ఇందులో 11 మంది ఇండిపెండెట్లు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి 8 మంది పోటీ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇండిపెండెంట్లు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు నామమాత్రంగానే ఓట్లు పోలయ్యాయి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు చీల్చిన ఓట్లు ప్రధాన పార్టీల గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇండిపెండెంట్లకు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 500 ఓట్లు కూడా రాలేదు. హైద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేసిన స్వతంత్రులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…