అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం పై జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఫ్రీ కరెంట్ పెటెంట్ కాంగ్రెస్ దే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రభాకర్ రావు దోచిపెట్టారన్నారు. విద్యుత్ రంగంలో అవకతవకలపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దొంగలు, అవినీతి అంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. ఎవరు ఎంత తిన్నారో అంత కక్కిస్తాం వదిలేస్తామా అని అన్నారు. టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ 24 గంటల విద్యుత్ ఇచ్చిందనేది పచ్చి అబద్ధమన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో 20వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందన్నారు. ఇందులో జగదీష్ రెడ్డి 10వేల కోట్ల రూపాయలు తిన్నారన్నారు. దీనికి స్పందించిన జగదీష్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు.
Read Also..
Read Also..