మేడ్చల్ జిల్లా, పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఒకేరోజు 100 సీసీటీవీ కెమెరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి సీసీటీవీ వ్యవస్థను పరిశీలించారు.ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానbని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలు తమ ఇళ్లు, కాలనీలు, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మీ సురక్ష – నేను సైతం 2.0″ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 3 వేల సీసీటీవీ కెమెరాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో మొత్తం 2 లక్షల 45 వేల 35 సీసీటీవీ కెమెరాలు ఉండగా, ఈ ఏడాదిలోనే మరో 16 వేల 339 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో ఈ ఏడాది 214 కేసులను ఛేదించగలిగామని సీపీ తెలిపారు. అలాగే లండన్ తరహాలో డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థను ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించామని, త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ విధానాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపడతామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పష్టం చేశారు.
Telangana
గ్రీన్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తూ దానికి అనుబంధంగా వివిధ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత సమన్వయంతో సుస్థిర అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధునిక కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు నుంచి పారిశ్రామిక రంగంలో సామర్థ్యాల విస్తరణ వరకు ప్రతి విభాగంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పారిశ్రామిక ప్రగతికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.
తారామతి, బారామతిని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. MCRHRDలో పర్యాటకశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు ఉన్నతాధికారులో సమీక్షలో పాల్గొన్నారు. దుర్గంచెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించాలన్నారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని… యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. క్యూర్ పరిధిలో ఉన్న అటవీశాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులు తీర్చి దిద్దాలని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలని… అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసుకొని పనులను ముమ్మరం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జీలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని… అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు. డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌పైన కసరత్తు ప్రారంభించాలని సూచించారు. సమ్మిట్ కోసం డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయానికి కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తారామతి, బారామతిని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. MCRHRDలో పర్యాటకశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు ఉన్నతాధికారులో సమీక్షలో పాల్గొన్నారు. దుర్గంచెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించాలన్నారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని… యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. క్యూర్ పరిధిలో ఉన్న అటవీశాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులు తీర్చి దిద్దాలని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలని… అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసుకొని పనులను ముమ్మరం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జీలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని… అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు. డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌పైన కసరత్తు ప్రారంభించాలని సూచించారు. సమ్మిట్ కోసం డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయానికి కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, మేడారం అభివృద్ధి పనులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.మేడారం అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం, ములుగు జిల్లాల్లో పర్యటించి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. 6 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారని, ఎర్రిఘట్టమ్మ సమీపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.అదే విధంగా ములుగు కలెక్టరేట్ నూతన భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్ర విద్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నట్లు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా నెలవారీ పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మరణించిన వ్యక్తుల పేర్లపై కూడా కొందరు పెన్షన్ నగదును డ్రా చేస్తున్నట్లు నిఘా వర్గాలు, క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
సాంకేతికత ఆధారంగా చేపట్టిన లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా ఈ అక్రమాలు బయటపడటంతో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. చనిపోయినవారు, అర్హత లేని వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అనర్హుల తొలగింపుతో మిగిలే నిధులను నిజమైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మంది అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా గుర్తించిన లక్ష మంది అనర్హుల స్థానంలో మరో లక్ష మంది అర్హులకు త్వరలో పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మొత్తం దాదాపు మూడు లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పెన్షన్ సౌకర్యం అందనున్నట్లు తెలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట కలిగించనుంది. త్వరలోనే అర్హుల తుది జాబితాను విడుదల చేసి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలతో పంచుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం మిడ్జిల్‌లో ‘రేవంత్ రెడ్డి’గా మొదలైన తన ప్రస్థానం, నేడు ప్రజల ఆదరాభిమానాలతో ‘రేవంతన్న’గా వారి గుండెల్లో నిలిచిపోయిందన్నారు. ఈ అద్భుత ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అభివర్ణించారు. ఈ 20 ఏళ్ల కాలంలో ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం తాను చేసిన ప్రతి పోరాటంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ‘తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడి’గా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అన్నింటికీ మించి ‘రేవంతన్న’గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక కాసేపట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయానికి వేదికైన మిడ్జిల్ మండలానికి సీఎం హోదాలో రానున్నారు.
తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ‘కృతజ్ఞత వందన సభ’తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయుడిని దర్శించుకొని.. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆలయ ఆవరణలో నాటి అనుచరులు, ముఖ్యనేతలతో మాటామంతీ నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిడ్జిల్ మండలం వెల్జాల ఎక్స్‌రోడ్డుకు చేరుకొని నేత గోపాల్‌రెడ్డి, బీఆర్అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేయనున్నారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు 12 రోజులుగా క్రితం అదృశ్యమైన బాలుడు నిఖిల్.. కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగా.. చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన ఘటన ఆసక్తికరంగా మారింది. షాపూర్‌నగర్‌కు చెందిన షేక్ అహ్మద్ అలీ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ నుంచి బాలుడిని తీసుకెళ్లి.. తన వద్ద ఉంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెండు రోజుల క్రితమే బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ పరిధిలోని చిలుకానగర్‌లో నివసిస్తున్న బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో రోజుల తరబడి ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలుడిని కిడ్నాప్ చేయడానికి గల కారణాలేంటి? నిందితుడి ఉద్దేశం ఏమిటి? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కార్మిక సంఘాల ఆందోళనలు, అధికారుల రిలే దీక్షలు, వేతన ఒప్పందంపై ఉత్కంఠ, ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపులతో బొగ్గు బెల్ట్ పారిశ్రామిక వాతావరణం వేడెక్కింది. కార్మికుల పెండింగ్ డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో తాజా పరిస్థితులపై సీవీఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీ.





Total views : 194661