జాబితా(List)లో 9 అసెంబ్లీ(Assembly), 4 పార్లమెంట్(Parliament) స్థానాలకు అభ్యర్థుల ప్రకటన:
రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) తాజాగా మరో జాబితా విడుదల(List release) చేసింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్(Parliament) స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి నిరాశ ఎదురయింది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఓ సారి పరిశీలిస్తే.. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు, భీమిలి – గంటా శ్రీనివాసరావు, పాడేరు (ఎస్టీ) – కిల్లు వెంకటరమేశ్ నాయుడు, దర్శి – గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు – వీరభద్ర గౌడ్ గుంతకల్లు – గుమ్మనూరు జయరామ్, అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ , కదిరి – కందికుంట వెంకటప్రసాద్ ను బరిలో నిలిపింది. పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ను పరిశిలిస్తే.. విజయనగరం – కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ, కడప – భూపేశ్ రెడ్డి పేర్లను టీడీపీ అధిష్టానం ప్రకటించింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: పవన్ కళ్యాణ్ వారాహి షెడ్యూల్ ఖరారు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి