ఏపీలో ధర్మ పరిరక్షణే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకునేలా చేస్తామన్నారు. పరిపాలనలో మార్పు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారన్నారు. తమిళనాడులోని పెరంబదూర్‌లో రామానుజర్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడకు చేరుకున్న చంద్రబాబుకు తమిళనాడులోని తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు సమర్థ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు తన కోసం కాదని, 5కోట్ల మంది ప్రజానీకం కోసమన్నారు. తెలుగువారి బాగు కోసమే తాను కృషి చేస్తామని స్పష్టం చేశారు. 11వ శతాబ్దంలోనే వినూత్న ఆలోచనలకు రామానుజర్ దేవాలయం శ్రీకారం చుట్టిందన్నారు. రామానుజర్ ఆశయాలు నేటి తరానికి తెలిసేలా చిన్నజీయర్ స్వామి హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పటం శుభపరిణామని తెలిపారు.
చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
65
previous post