భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

devotees

Advertisements

&NewLine;<p>నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడాయి&period; ఏపీలోని తిరుమల&comma; శ్రీశైలం&comma; సింహాచలంతో పాటు తెలంగాణలో యాదాద్రి&comma; వేములవాడ&comma; భద్రాద్రి&comma; బాసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు&period; తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతరప్రాంతాల నుంచీ తరలివచ్చారు&period; స్వామివారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని ప్రార్థించారు&period; దీంతో శ్రీవారి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది&period; శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు&comma; తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు&period; వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు&period; శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు గవర్నర్‌ తమిళిసై తెలిపారు&period; తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది&period; కొత్త ఏడాది తొలి రోజు కావడం&comma; మేడారం జాతరకు ముందుగా భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తుండడంతో గర్భాలయంలో ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు&period; ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు&period;&period; స్వామి వారికి కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు&period; అనంతరం స్వామివారి దర్శించుకుంటున్నారు&period; భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు&period; ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు&period; ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని విశేష పూజలు నిర్వహించారు&period; కొత్త సంవత్సరం కలిసి రావాలంటూ వేడుకున్నారు&period; అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..