డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం, మురమళ్ల కార్తీక మాసం అమావాస్య మహా పర్వదినం పురస్కరించుకుని మురమళ్లశ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా మంగళవారం జరిగింది. భక్తులు వెలిగించిన దీపాళ కాంతులతో ఆలయం కళకళలాడింది. కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ కుమార్, ఆలయం కమిటీ చైర్మన్ వాసురాజు లతో పాటు పలువురు నాయకులు.ఆలయంలో ప్రత్యేక పూజలు… ఆకర్షనీయంగా నిలిచిన మంచుకొండల నడుమ శివలింగం సెంటింగ్. ముమ్మిడివరం శాసన సభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్.కుమార్, చైర్మన్ శ్రీ పెన్మత్స వాసురాజు దంపతులు, కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. తొలుత పార్థీవ లింగానికి ఆలయ అర్చకులు , పురోహితులు ఆధ్వర్యంలో అభిషేకం ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఆవరణ చుట్టూ దేవతా మూర్తుల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ వెలుపల, బయట దీపాలంకరణ తో ఆలయం కళకళలాడింది. మండల నలుమూలల నుండి భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం పచ్చి పూల అలంకరణ తో సర్వాంగసుందరంగా అలంకరించారు.సత్యసాయి సేవా ట్రస్ట్ సేవకులు, సమరసత సేవ ట్రస్ట్ నుండి విశేషసేవలందించారు. కార్యనిర్వాహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, సర్పంచ్ కాలే రాజబాబు, పెన్మత్స చిట్టిరాజు, మాజీ చైర్మన్ లు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.
దీప కాంతులతో వెలిగిపోతున్న ఆలయాలు…
132
previous post