91
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి తాగిన మైకంలో కొంతమంది యువకులు లక్ష్మీపేట లో మెహబూబ్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాలైన మహబూబ్ చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధువారం మృతి చెందాడు. అయితే మహబూబ్ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శివ సర్కిల్లో పెద్ద ఎత్తున యువకులు చేరుకొని మృతదేహంతో ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. ఈ యువకుడి మరణంతో పట్టణంలో ముందు ముందు ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటాయేమోనని పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.