నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో సీఎం జగన్ రైతుల ముఖాముఖి కార్యక్రమం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భూమా వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. రైతులతో ముఖాముఖి సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ వర్గం పై ఎమ్మెల్యే గంగుల నాని వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో భూమా అఖిల ప్రియని అరెస్ట్ చేసి, శిరివెళ్ల స్టేషన్‌కు పోలీసులు తరలించే యత్నం చేశారు. పోలీసుల వాహనం ఎక్కేందుకు భూమా అఖిలప్రియ నిరాకరించారు. శిరివెళ్ల పోలీస్ స్టేషన్ కు నడుస్తూ వస్తానంటూ స్టేషన్‌కు అఖిల ప్రియ బయలుదేరారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతుల పై ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చేయి ఎత్తారని అఖిల ప్రియా ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని…. పోలీసులు పట్టించుకోకపోతే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అఖిలప్రియ అన్నారు.
జగన్ రైతుల ముఖాముఖి కార్యక్రమం వద్ద ఉద్రిక్తత…
96
previous post