ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Advertisements

<p>MCRHRDలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు&comma; ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు&period; ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు&period; పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఆదేశించారు&period; జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు&period; భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు&period; జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు&period; ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు&period; ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు&comma; వాకిటి శ్రీహరి&comma; ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు&comma; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..