కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ బృందం భేటీ ..

కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ బృందం భేటీ

Advertisements

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ&comma; పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు&period; హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు సంబంధించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు&period; రెండోదశలో భాగంగా మొత్తం 122&period;9 కిలోమీటర్ల మేర విస్తరణ&comma; 7 కారిడార్లు&comma; 86 మెట్రో స్టేషన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది&period; ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 595 కోట్లు గా ఉంది&period; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు సమాన భాగస్వామ్యంతో చేపట్టేలా అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు&period; శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణపై ప్రధానంగా చర్చించారు&period;<br &sol;>&NewLine;ఏప్రిల్ 30&comma; 2026 నాటికి మెట్రో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత జరుగుతున్న ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది&period; సీఎంతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; ఎంపీలు మల్లు రవి&comma; కె&period; రఘువీర్ రెడ్డి తదితరులు సీఎంతో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..