తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన

Advertisements

<p>తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది&period; సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న SIR- 2026 కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి చేపట్టనున్నారు&period; ఈ కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర సీఈవో సి&period; సుదర్శన్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; జీహెచ్ఎంసీ కమిషనర్&comma; జిల్లా ఎన్నికల అధికారులు &comma; ఈఆర్ఓలు&comma; అదనపు సీఈవోతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు&period; భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా&comma; కచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు&period; బూత్ లెవల్ అధికారులు&comma; ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ&comma; ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు&period; ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి&comma; వాటిని ధృవీకరిస్తారు&period; నకిలీ&comma; మరణించిన మరియు చిరునామా మారిన ఓటర్లను జాబితా నుంచి తొలగించి&comma; అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు&period; ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మందికి పైగా బీఎల్ఓలు&comma; దాదాపు 26 వేల మంది బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించనున్నారు&period; 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు&period; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3&period;39 కోట్ల మంది ఓటర్ల వివరాలను ఈ సర్వేలో సమగ్రంగా పరిశీలించనున్నారు&period; ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.