సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం

Advertisements

<p>సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు&period; వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు&period; ఈ బ్లాక్‍ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని ఇందులో బీజేపీ ప్రభుత్వం కొత్తగా అలాట్ చేసిందేంటని ప్రశ్నించారు&period; అయితే గతంలోనే కేటాయిస్తే 2013 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టారన్నారు&period; బ్లాక్ కేటాయింపు జరిగింది&period;&period; మైనింగ్ లీజు కోసం అనుమతి ఇవ్వలేదన్నారు&period;<&sol;p>&NewLine;<p>కొత్త యాక్ట్ ప్రకారం తాడిచర్ల -2 సింగరేణికి ఇవ్వబోమని చెప్పారు&period; కానీ యాక్ట్ రావడానికి ముందే సింగరేణికి తాడిచర్ల-2 కేటాయించారనే ఈ విషయాలను మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని&comma; కేంద్ర మంత్రులను కలిసి వాస్తవాలను వారి ముందు ఉంచామన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి అనుమతులు తెచ్చిందని ఇప్పటికైనా అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు&period; తెలంగాణపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే సింగరేణి పరిధిలోని గనులన్నీ సింగరేణికే కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.