బిల్ట్ కర్మాగారం తెరుచుకునేనా?

బిల్ట్ కర్మాగారం తెరుచుకునేనా...? బిల్ట్ కర్మాగారం తెరుచుకునేనా...?

Advertisements

<p>ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని బిల్ట్ పరిశ్రమ&period; అజంజాహీ కంపెనీ తర్వాత అంత పెద్ద కర్మాగారం గా పేరొందింది బిల్ట్ పరిశ్రమ&period; లక్షల టన్నుల్లో కాగితపు గుజ్జు ఉత్పత్తి&period;&period; వేలాదిమంది కార్మికులకు ఉపాధి చూపించిన ఈ పరిశ్రమ మూతపడి పుష్కరకాలమైంది&period; కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ బిల్ట్ పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి&period; బిల్ట్ గేట్లు మళ్లీ తెరుచుకుంటాయని &period;&period;మా కలలు నెరవేరతాయని ఆశగా ఎదురుచూస్తున్న కార్మిక కుటుంబాలపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లంలోని క‌à°®‌లాపూర్‌ లో 1975లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఈ పరిశ్రమను ఏర్పాటుచేసింది&period; 610 ఎకరాల్లో నెలకొల్పిన ఈ పరిశ్రమలో ఏడాదికి 90 వేల టన్నుల కాగితపు గుజ్జు ఉత్పత్తి అయ్యేది&period; ఒకప్పుడు వేయి మంది పర్మినెంట్ కార్మికులు&comma; 20వేల మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేశారు&period; మరో 6 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందారు&period; బిల్ట్ పరిశ్రమలో ఉత్పత్తి అయిన కాగితపు గుజ్జును గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేస్తుండేది&period; ఆ తర్వాత ఈ కంపెనీ సొంతంగా పరిశ్రమను నెలకొల్పింది&period; దీంతో 2014 ఏప్రిల్ లో బిల్ట్ కాగితపు గుజ్జు కొనుగోలును నిలిపివేసింది&period; దీనికి తోడు పల్ప్ కు మార్కెట్ లేక నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసి&&num;8230&semi;&period;పరిశ్రమను మూసేసింది&period; 2014 ఏప్రిల్ 6à°µ తేదీన నుంచి కార్యకలాపాలు నిలిచిపోయాయి&period;ఉద్యోగులు&comma; కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు&period; వారితో పాటు మండల వ్యాప్తంగా పరోక్షంగా మరో 10 వేల కుటుంబాలు&comma; వ్యాపారులు సైతం ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోయారు&period; యంత్రాలు సైతం తుప్పుబట్టి…ఎందుకూ పనికిరాకుండా పోయాయి&period;<&sol;p>&NewLine;<p>ఓ పక్క కర్మాగారం పునఃప్రారంభం కోసం ఉద్యమిస్తున్న తరుణంలోనే కార్మికులు అ భద్రతా భావానికి గురై అనారోగ్యం పాలయ్యారు&period; కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదు&period; అప్పులు పెరగడంతో ఉన్నతంగా బతికిన కార్మికుల కుటుంబాలు చివరకు పిల్లలను చదివించలేని దీనావస్థలో ఆత్మహత్యలకు పాల్పడ్డాయి&period; అనారోగ్యాలతో మృత్యువాత పడ్డారు&period; దీంతో సుమారు 46 మంది కార్మికులు బిల్ట్ ఉద్యమంలో అసువులు బాసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p>కనీసం కుటుంబం గడవటం కూడా కష్టంగా మారింది&period; 72 నెలలకుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు కార్మికులు&period; అనారోగ్యంతో సరైన వైద్యం అందక ఇప్పటి వరకూ సుమారు 40 మంది వరకు కార్మికులు చనిపోయారు&period;<&sol;p>&NewLine;<p>గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాయితీలు ప్రకటించినా అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి&period; బిల్ట్ పునరుద్ధరణకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి ఏళ్లు గడిచినా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు రాలేదు&period;కార్మికులు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు&period;<&sol;p>&NewLine;<p>ఇవాళ ఐదు వేల మంది కార్మికుల జీవితాలు కొడిగట్టాయి&period; కార్మికు à°² పరిస్థితి దయనీయంగా ఉంది&period; వారి దుస్థితి చూస్తుంటే మనకే ఏడుపు వచ్చే పరిస్థితి ఉంది&period; ఇపుడున్న మంత్రి ఈ పరిశ్రమ తెరిపిస్తారనే ఆశతో కార్మికులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p>నేడు రేపు అంటూ నోటి మాటలతో యాజమాన్యం కాలం వెళ్లదీస్తున్నారు కంపెనీ ముతపడటంతో ఏంచేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు&period; ఎక్కడా పని దొరకక మా ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి&period;<&sol;p>&NewLine;<p>పదేళ్ల బిల్ట్ అవసానదశ కల్లారా చూసిన ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రి సీతక్క&comma; యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది&period; ఖాయిలా పడ్డ బిల్ట్‌ను పున&colon; ప్రారంభించడం సాధ్యమయ్యే పని కాదు కనుక దాని స్థానంలో ఐటీసీ లేదా మరేదైనా కంపెనీలతో కొత్త పరిశ్రమను తెరిపించే అవకాశాలున్నాయి&period; ఆ దిశగా చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.