తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.

Advertisements

<p>తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది&period; ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; ఈ సందర్భంగా ధరణి&comma; నీటిపారుదల ప్రాజెక్టులు&comma; బుల్లెట్ ట్రైన్&comma; డిగ్రీ కళాశాలల్లో పోస్టుల భర్తీ&comma; ఇందిరమ్మ ఇళ్లు&comma; గ్రామ పంచాయతీల ఆదాయం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ సమావేశంలో దేవాదుల&comma; చిన్న కాళేశ్వరం&comma; పాలమూరు-రంగారెడ్డి&comma; సీతారామ ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది&period; అలాగే జగిత్యాల జిల్లాలోని డిగ్రీ కళాశాలలో పలు పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది&period; సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమి కేటాయింపునకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది&period; బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పునూ మంత్రివర్గం ఆమోదించింది&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణ పంచాయతీ రాజ్-2018 చట్ట సవరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీలో కాకుండా ఇకపై నేరుగా జీపీ బ్యాంకు ఖాతాలోనే జమయ్యేలా 70&lpar;3&rpar; సెక్షన్ సవరణకు పచ్చజెండా ఊపింది&period; ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది&period; ముఖ్యంగా ధరణి పోర్టల్‌ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం &lpar;SIT&rpar; ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది&period; ధరణి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని తీర్మానించింది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు&comma; మంత్రిమండలి నిర్ణయంతో సిట్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది&period; సిట్ ద్వారా భూ రికార్డుల మార్పులు&comma; అక్రమ మ్యుటేషన్లపై విచారణ చేపట్టాలని భావిస్తోంది&period; ప్రభుత్వ&comma; అసైన్డ్&comma; వక్ఫ్&comma; దేవాదాయ భూముల లావాదేవీలపైనా ప్రత్యేక దృష్టి సారించనుంది&period; అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది&period; అవసరమైతే మాజీ అధికారులు&comma; బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది&period; సాంకేతిక అంశాలపై నిపుణుల సహకారంతో దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది&period; ధరణి ద్వారా జరిగిన భూ వివాదాలన్నింటిపైనా వివరాల సేకరణకు కసరత్తు చేస్తోంది&period; అక్రమంగా లబ్ధి పొందిన వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది&period; ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు&comma; సంబంధిత పత్రాల పరిశీలనను ప్రారంభించాలని తీర్మానించింది&period; సిట్ ద్వారా ధరణి అక్రమాలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.