తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం

Advertisements

<p>క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌తో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ధైర్యంగా ఉండొచ్చని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పోర్టల్‌ను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ప్రారంభించారు&period; ఉద్యోగ సంఘాల నేతలకు కొత్త హెల్త్‌ కార్డులు అందజేశారు&period; ఈ పథకంలో ఉద్యోగుల నుంచి ప్రతి నెలా మూల వేతనంలో 1&period;5 శాతం చందా వసూలు చేస్తారు&period; అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది&period; వైద్య చికిత్సలకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ రేట్లను వర్తింపజేస్తారు&period;<&sol;p>&NewLine;<p>నగదు రహిత చికిత్స పథకాన్ని అందించాలని ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారని&period;&period;పదేళ్లు అధికారంలో ఉన్నా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు భట్టి విక్రమార్క&period; ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని చెప్పారు&period; 9&period;5లక్షల మంది ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త EHS పోర్టల్‌ను తీసుకొచ్చామని తెలిపారు&period; రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ&period;10లక్షలకు పెంచామని గుర్తు చేశారు&period; 1&period;06 కోట్ల మంది పేదలకు ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నామని&period;&period; బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులను కూడా పెండింగ్‌లో పెట్టిందని భట్టి విమర్శించారు&period;<br &sol;>&NewLine;మరోవైపు ఉద్యోగులు&comma; పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు మంత్రి దామోదర&period; కొత్త EHS కార్డుల ద్వారా ఆసుపత్రుల్లో పూర్తిగా రూపాయి ఖర్చు లేకుండా నగదు రహిత చికిత్సలు అందుతాయని స్పష్టం చేశారు&period; ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 886 నెట్‌వర్క్ ఆసుపత్రులను అనుసంధానం చేశామని చెప్పారు&period; దాదాపు 1వెయ్యి816 రకాల వైద్య చికిత్సలు&comma; ఆపరేషన్లను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు&period; ఉద్యోగులకు మరింత నాణ్యమైన&comma; వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 24 వెల్‌నెస్ సెంటర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి దామోదర స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.