కాలేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన.

Advertisements

<p>కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు&period; 2027 జూలై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు&period; కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు&period; కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ&comma; అన్నారం&comma; సుందిళ్ల బ్యారేజీలను నిపుణుల బృందాలు క్షుణ్ణంగా పరీక్షించాయని మంత్రి తెలిపారు&period; ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డిజైన్లను నిపుణులు లోతుగా పరిశీలిస్తున్నారని&comma; వారందించే తుది నివేదికలు&comma; సూచనల ఆధారంగా బ్యారేజీలన్నింటినీ సమగ్రంగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు&period; కాళేశ్వరం ఫౌండేషన్‌ లోపాల వల్లే అన్నారం&comma; సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని నిపుణులు పేర్కొంటున్నారని మంత్రి తెలిపారు&period; ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యారేజీలలో నీళ్లను నిల్వ చేస్తే అవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారని పేర్కొన్నారు&period; ఈ సాంకేతిక కారణాల వల్లే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ప్రస్తుతం నీటిని ఎత్తిపోయడం లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.