కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ భేటీ.

Advertisements

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు&period; రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు&comma; ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది&period; ఈ సమావేశం ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని సంతరించుకుంది&period;ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం&period; కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణతో పాటు&comma; నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు&period; ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆమోదం కోసం ఆయన వేణుగోపాల్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం&period; మంత్రి కొండా సురేఖ&comma; రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులు&comma; వారు సమర్పించిన వివరణలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది&period; వీరిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అధిష్ఠానం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది&period; మంత్రి కొండా సురేఖ&comma; ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు&comma; తదనంతర పరిణామాలపై అధిష్టానానికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చేసుకుని సీఎం రేవంత్ పూర్తి వివరాలు అందించినట్లుగా సమాచారం&period; మరోవైపు పార్టీ సీనియర్ నేత&comma; ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపై కూడా ఈ భేటీలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది&period; మరోవైపు కేసీని కలిసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా విశ్వప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది&period; మంత్రివర్గ విస్తరణలో ఇచ్చిన మాట మేరకు తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టాన పెద్దలను కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష.

శవాల దిబ్బగా నేపాల్.

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు.