ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..

ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

Advertisements

<p>ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదని అయినా రైతులకు ఇబ్బంది లేకుండా మేమే కొంటున్నామని ముఖ్యమంత్రి&comma; మంత్రులు చేస్తున్న ఆరోపణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు&period; ధాన్యం సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ధాన్యం తీసుకోదన్నారు&period; ఇవాళ హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మీకు చేతగాక కేంద్రంపై విమర్శలా అని ప్రశ్నించారు&period;ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వద్ సరైన ప్రణాళిక లేదని ప్రభుత్వం దృష్టంతా కమీషన్లు&comma; కాంట్రాక్టులు&comma; రియల్ ఎస్టేట్ పై ఉందని ఆరోపించారు&period; మేం యాత్ర చేసే వరకూ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పందించలేదన్నారు&period; ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన సన్నబియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా సరఫరా చేస్తూ అక్కడి నుంచి నాసిరకమైన సన్ని బియ్యం దిగుమతి చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు&period; వాటినే రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు&period; ఎవరి ఆశీస్సులతో ఇదంతా జరుగుతోందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు&period; రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యంలో మోసం జరుగుతోందన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వానికి తమాషా అయిపోయిందని మాటకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా మారిందన్నారు&period; వీళ్లు మాత్రమే నీతిగా పని చేస్తారనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..