తెలంగాణలో సమగ్ర ఓటరు జాబితా సవరణ మూడో దశ ప్రక్రియ.

తెలంగాణలో సమగ్ర ఓటరు జాబితా సవరణ మూడో దశ ప్రక్రియ

Advertisements

<p>దేశవ్యాప్తంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ మూడో దశ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు&period; హైదరాబాద్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు&period; ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్&comma; ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ నేతృత్వం వహించారు&period; ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి&period; సుదర్శన్ రెడ్డి అధికారులనుద్దేశించి ప్రసంగిస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు&comma; ఎస్ఐఆర్ కోసం నియమించిన సిబ్బంది&comma; ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల గురించి వివరించారు&period; రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 68&period;30శాతం మ్యాపింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>భారత ఎన్నికల సంఘం అధికారులు ఎస్ఐఆర్ పై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు&period; ఇందులో భారత రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలు&comma; ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950&comma; ఓటర్ల నమోదు నియమాలు-1960 గురించి వివరించారు&period; అలాగే ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను వివరించి&comma; ఈ ప్రక్రియలోని ముఖ్య దశలను&comma; ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ&comma; క్లెయిమ్‌లు&comma; అభ్యంతరాల దాఖలు&comma; నోటీసుల జారీ&comma; వాటి పరిష్కారం&comma; తుది ఓటరు జాబితా ప్రచురణ తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు&period; గణన ఫారాలను నింపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈసీఐ అధికారులు సూచించారు&period; అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో గణన ఫారాల సమర్పణను విస్తృతంగా ప్రచారం చేయాలని&comma; ఓటర్లకు ఎస్ఐఆర్ గురించి త్వరితగతిన సమాచారం అందించే &OpenCurlyQuote;బుక్ ఎ కాల్’ సదుపాయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..

ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.

నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.