సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మం. మల్గి గ్రామ సరిహద్దులో బీదర్ చెత్త.

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మం. మల్గి గ్రామ సరిహద్దులో బీదర్ చెత్త

Advertisements

<p>తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో చెత్త సెగలు రేపుతోంది&period;&period; కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ చెత్త తెలంగాణ సరిహద్దు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది&period;&period;ఆ చెత్త కంపు వల్ల రోగాల బారిన పడుతున్నామని తెలంగాణ సరిహద్దు గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి&period;&period; కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో నెలకొన్న డంపింగ్ యార్డ్ ఇష్యూపై సివిఆర్ న్యూస్ స్పెషల్ ఫోకస్&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>తెలంగాణ-కర్ణాటక బోర్డర్‌లోని న్యాల్కల్ మండలం మల్గి గ్రామ సరిహద్దులో గాలి పీల్చాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు&period;&period;గత కొన్ని రోజులుగా కంటి నిండా నిద్రలేదు&period;&period; ఒంటి నిండా రోగాలతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు&period; సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామస్తులు గత కొద్ది రోజులుగా నరకం చూస్తున్నారు&period;&period; కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నగరం నుంచి వందలాది టన్నుల వ్యర్థాలను తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ఆనుకుని ఉన్న సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డ్‌లో పారబోస్తుండటంతో పర్యావరణం కలుషితమవుతోందనీ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;&period; కర్ణాటకలోని బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజూ తరలిస్తున్న టన్నుల కొద్దీ చెత్తతో ఈ ప్రాంతం డెత్ జోన్‌గా మారుతోంది&period;<&sol;p>&NewLine;<p>బీదర్ నగరానికి చెందిన సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డ్ సరిగ్గా తెలంగాణ బోర్డర్ గ్రామాలకు ఆనుకుని ఉంటుంది&period; నిబంధనల ప్రకారం రీసైక్లింగ్ చేయాల్సిన మున్సిపాలిటీ&period;&period; ఇక్కడ బహిరంగంగా చెత్తను తగలబెడుతోంది&period;&period;ఆ విషపూరిత పొగ&comma;దుర్వాసన న్యాల్కల్ మండలంలోని గ్రామాలను కమ్మేస్తోంది&period;&period;ఈగలు&comma; దోమల తాకిడి పెరిగి చిన్నపిల్లలు&comma; వృద్ధులు ఆస్పత్రుల పాలవుతున్నారు&period; ప్రతిరోజూ బీదర్ మున్సిపాలిటీ నుంచి సుమారు 40 టన్నులకు పైగా చెత్త సేకరించి సరిహద్దు గ్రామమైన సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు&period; అయితే&comma; ఈ వాహనాలన్నీ తెలంగాణ పరిధిలోని మల్గి గ్రామం మీదుగానే వెళ్లాల్సి వస్తోంది&period; తరలింపు సమయంలో వాహనాల నుంచి కుళ్ళిన మురుగునీరు రోడ్లపై కారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది&period; దీనికి తోడు&comma; సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డులో నిబంధనలకు విరుద్ధంగా చెత్తను తగలబెడుతుండటంతో ఆ విషపూరితమైన పొగ మల్గి పరిసర గ్రామాలను పూర్తిగా కమ్మేస్తోంది&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>గత వారం రోజులుగా మల్గి గ్రామస్తులు ఈ దారి గుండా ఒక్క చెత్త బండిని కూడా పోనివ్వకుండా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు&period;&period;బీదర్ మున్సిపాలిటీ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం సుల్తాన్‌పూర్ లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తామని ఏళ్ల క్రితం ప్రకటించినా&comma;అది నేటికీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు&period;&period;ఫలితంగా పొరుగు రాష్ట్రం చేస్తున్న పర్యావరణ నేరానికి తెలంగాణ సరిహద్దు ప్రజలు బలిపశువులవుతున్నారు&period; ఇప్పటికైనా సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు&comma; తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని&comma; మల్గి గ్రామం మీదుగా చెత్త తరలింపును శాశ్వతంగా అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం