సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!

సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!

Advertisements

<p>తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది&period; హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు&period; గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణల మధ్య&comma; వారికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది&period; తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వేలాది మంది ఉద్యమకారుల గుర్తింపు అంశంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది&period; ఈ క్రమంలో సచివాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు&comma; ఉద్యమ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు&period; తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో అసలైన ఉద్యమకారులను ఎలా గుర్తించాలనే అంశంపై విస్తృత చర్చ జరిగింది&period; ఉద్యమ కాలంలో నమోదైన కేసులు&comma; జైలు శిక్షలు&comma; పోరాటాల్లో పాల్గొన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచించారు&period; సూచనలను పరిశీలించి పారదర్శక విధానంతో ఉద్యమకారుల గుర్తింపును ఖరారు చేయనున్నట్లు కమిటీ తెలిపింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం