జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు

Advertisements

<p>జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7à°µ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది&period; దాదాపు 18 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు&period; సీసీ రోడ్లు లేక వర్షం పడితే బురదమయంగా మారుతున్న వీధులు… డ్రెయినేజీ లేక మురుగు నీరు నిల్వలు… తాగునీటి సమస్య… రాత్రివేళ వీధి దీపాలు లేక చీకట్లోనే జీవనం… ఇలా ప్రజల దైనందిన జీవితం కష్టాలతో సాగిపోతోంది&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వాలు మారినా గద్వాల పట్టణ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కాలనీలో సరైన రోడ్లు లేక ప్రజలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు&period; డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు వీధుల్లోనే నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది&period; రాత్రి వేళ వీధి దీపాలు లేక మహిళలు&comma; వృద్ధులు&comma; చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; తాగునీటి సరఫరా కూడా సక్రమంగా లేక ప్రజలు దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది&period; కాలనీ అభివృద్ధికి ఎన్నోసార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>పిల్లిగుండ్ల కాలనీలో పాఠశాల&comma; అంగన్‌వాడీ కేంద్రాల కోసం స్థలం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; చిన్నారులు విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక అత్యవసర సమయంలో ఇబ్బందులు పడుతున్నారు&period; కాలనీలో శ్మశానవాటిక కూడా లేక అంత్యక్రియల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; కనీస అవసరాలు కూడా లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు… ఎన్నికలు ముగిసిన తర్వాత కాలనీ వైపు చూడటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; సమస్యల పరిష్కారంపై అధికారులు&comma; ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీ వాసులు మండిపడుతున్నారు&period;<br &sol;>&NewLine;7à°µ వార్డులోని దౌదర్‌పల్లి – పిల్లిగుండ్ల కాలనీలు గత పాలకుల నిర్లక్ష్యానికి బలయ్యాయని స్థానిక కౌన్సిలర్ జగదీశ్ ఆరోపిస్తున్నారు&period; ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని… అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరుతున్నారు&period; కాలనీలో సీసీ రోడ్లు&comma; డ్రెయినేజీ&comma; తాగునీటి సౌకర్యం&comma; వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాల&comma; అంగన్‌వాడీ&comma; ప్రాథమిక ఆరోగ్య కేంద్రం&comma; శ్మశానవాటిక నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period; ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పిల్లిగుండ్ల కాలనీ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!