105
ముఖ్యమంత్రి, మంత్రులు వారి స్థాయిని తగ్గించుకుని బిజెపీపై నీచంగా మాట్లాడుతున్నారని ఎంపి లక్ష్మణ్ మండిపడ్డారు. బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకువస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 45 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర ముగిసిందని తెలిపారు. అయోధ్య రామాలయం నిర్మించినందుకు పల్లెల్లో బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అనవసరంగా తమపై విమర్శలు చేయడం మానుకోవాలని లక్ష్మణ్ హితవు పలికారు.